అక్షరటుడే, కామారెడ్డి : Inter Exams Kamareddy District | ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై జిల్లాస్థాయి అధికారులతో సోమవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Inter Exams Kamareddy District | జిల్లాలో 37 కేంద్రాలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల కోసం జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 21 ప్రభుత్వ కళాశాలలు, 6 ప్రభుత్వ సెక్టార్ కళాశాలలు, 10 ప్రైవేట్ కళాశాలాల్లో పరీక్షలు (Exams) నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 17,953 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో ఫస్టియర్ విద్యార్ధులు 9,013 మంది, సెకండియర్ విద్యార్ధులు 8,940 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.
Inter Exams Kamareddy District | ప్రశాంతంగా.. పారదర్శకంగా..
పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల పై సమగ్రంగా చర్చించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కోసం జిల్లా పరీక్షా కమిటీ (District Examination Committee) నియమించడం జరిగిందని, పరీక్షల విభాగం కన్వీనర్‌గా జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం (District Nodal Officer Sheikh Salam), సభ్యులుగా ఎండీ యాకీనుద్దీన్, ఇర్ఫానా ఫర్హీన్లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ చర్యలలో భాగంగా ప్రతి 25 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటాయని, విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని, అవసరమైతే బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచాలని సూచించారు.