Inter Exams in Nizamabad | ప్రశాంతంగా ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, ఇందూరు: Inter Exams in Nizamabad | జిల్లావ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరిగాయి. Inter Exams in Nizamabad | మొదటిరోజు పరీక్షల్లో.. మొదటిరోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దు, అరబిక్ సబ్జెక్టుల్లో పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం (Intermediate Exams) కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి హాల్​టికెట్లు జారీ చేశారు. […]

అక్షరటుడే, ఇందూరు: Inter Exams in Nizamabad | జిల్లావ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరిగాయి.

Inter Exams in Nizamabad | మొదటిరోజు పరీక్షల్లో..

మొదటిరోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దు, అరబిక్ సబ్జెక్టుల్లో పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం (Intermediate Exams) కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి హాల్​టికెట్లు జారీ చేశారు. రెండురోజుల ముందుగానే పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

58 పరీక్ష కేంద్రాల్లో..

జిల్లావ్యాప్తంగా మొత్తం 58 పరీక్ష కేంద్రాలను (Education News) ఏర్పాటు చేసినట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్(Inter Education Officer Ravikumar) తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్​ సెంటర్లు మూసి ఉంచేలా పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. చూచిరాతలను నిరోధించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్(Flying Squad) బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను పరీక్షలను పర్యవేక్షించాయని ఆయన వివరించారు. అలాగే జిల్లా హైపర్ కమిటీ, పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

కామారెడ్డిలో మొదటి రోజు 337 మంది గైర్హాజరు

అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డిలో ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా దాదాపు 8 గంటల వరకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇంటర్ పరీక్షల కోసం అధికారులు 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం ఇంటర్ మొదటి సంవత్సరం 9565 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 9228 మంది విద్యార్థులు హాజరు కాగా 337 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.విద్యార్థులకు పరీక్షలకు కావాల్సిన వస్తువులు తప్ప ఇతర వాటిని లోపలికి అనుమతించలేదు. హాల్ టికెట్స్ తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. పరిక్షా కేంద్రాలను కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...

Odisha Mines Officer Bribery | లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్​ అధికారి.. ఇంట్లో రూ.4 కోట్లు సీజ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha Mines Officer Bribery | ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా...

Private Hospital Case | ప్రైవేట్​ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు

నగరంలో ప్రైవేట్​ ఆస్పత్రిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పత్రిలో మత్తు వైద్యుల నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల...