HomeతెలంగాణInter Exams | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. త్వరలోనే షెడ్యూల్​ విడుదల

Inter Exams | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. త్వరలోనే షెడ్యూల్​ విడుదల

ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్​కుప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్​కు (Exam schedule) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Inter Exams | మార్చి వరకు..

ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి 18 వరకు జరుగనున్నాయి. పూర్తి షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. గతేడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమయ్యాయి. ఈసారి మూడు రోజులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఒకరోజు ఫస్టియర్, మరో రోజు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.

Inter Exams | జనవరిలో ప్రాక్టికల్స్​..

జనవరిలో ఎథిక్స్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ (Environmental Science), ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫిబ్రవరిలోనే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈసారి ఇంటర్ పరీక్ష ఫీజును రూ.30 పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హ్యుమానిటీస్ (ఆర్ట్స్) కోర్సుల ఫీజు రూ. 520 ఉండగా, తాజా పెంపుతో రూ.550 కానున్నది.

సైన్స్ విద్యార్థులకు ఫీజు రూ. 750 ఉండగా, ఇప్పుడు రూ.780కి పెరగనున్నది. గతేడాది రూ.20 పెంచగా, ఈసారి రూ.30 పెంచారు. ఒకేసారి భారీగా కాకుండా ఏడాదికి కొంత చొప్పున ఫీజులు వడ్డిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు ఈ వారంలోనే విడుదల చేయనుంది. ఇక నామినల్ రోల్స్​లో తప్పులు ఉండకుండా ఇంటర్ బోర్డు పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈనెల 27 వరకు తప్పులుంటే సవరించుకునే అవకాశం ఇచ్చారు.

Must Read
Related News