అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Exams Begin | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రారంభం అయ్యాయి. ఫస్టియర్ విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షలకు హాజరు అయ్యారు.
ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 18వరకు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయి. సెకండియర్ (Second Year) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Inter Exams Begin | 1,495 కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను (Exam Centers) ఏర్పాటు చేశారు. అందులో ప్రైవేట్ కాలేజీలు 863, ప్రభుత్వ కాలేజీలు 425, పాఠశాలల్లో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు (Students) హాజరు కానున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు, రవాణా, విద్య, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖలతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

