అక్షరటుడే, ఇందూరు: Inter-district thief |పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆదివారం ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. మిట్టపల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి నిజామాబాదు రూరల్, నవీపేట్, నందిపేట్, కామారెడ్డి జిల్లాలలో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతని పై కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్లో కేసులు ఉన్నాయి.
Inter-district thief | 60 గ్రాముల గోల్డ్ స్వాధీనం..
విశ్వసనీయ సమాచారం మేరకు కంఠేశ్వర్ సమీపంలో నిందితుడిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒక బజాజ్ పల్సర్ బైక్, సుమారు 60 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.