Homeజిల్లాలునిజామాబాద్​Inter Colleges | ఇంటర్ కళాశాలల మరమ్మతులకు మోక్షం.. రూ.3.23 కోట్లు మంజూరు

Inter Colleges | ఇంటర్ కళాశాలల మరమ్మతులకు మోక్షం.. రూ.3.23 కోట్లు మంజూరు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Inter Colleges | జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు విడుదలైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (DIEO Ravi kumar) తెలిపారు. జూనియర్ కళాశాలల బలోపేతం కోసం తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు రంగులు, ఫర్నిచర్, బెంచీలు, బ్లాక్ బోర్డుల నిర్మాణానికి నిధులను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.

Inter Colleges | కళాశాలలు.. నిధుల వివరాలు..

నిజామాబాద్​ బాలికల కళాశాలకు రూ.30లక్షల నిధులు మంజూరయ్యాయి. అలాగే నిజామాబాద్​ ఖిల్లా బాలుర కళాశాలకు రూ.56లక్షలు, డిచ్​పల్లి రూ.14లక్షలు, మాక్లూర్ రూ.10 లక్షలు, మోర్తాడ్ రూ.26.35 లక్షలు, వర్ని రూ. 20.50 లక్షలు, బోధన్ రూ.10.70 లక్షలు విడుదలయ్యాయి. ఆర్మూర్ (బాలికలు) రూ.16 లక్షలు, ఆర్మూర్ (బాలురు) రూ.24 లక్షలు, భీమ్​గల్​ రూ.18 లక్షలు, ఐలాపూర్ రూ.9 లక్షలు, బాల్కొండ రూ.33.05 లక్షలు, ధర్పల్లి రూ.25 లక్షలు, కోటగిరి రూ.30.50లక్షల చొప్పున మంజూరయ్యాయి.