అక్షరటుడే, ఎల్లారెడ్డి: Inter Classes | ఇటీవల ఇంటర్ ఫలితాల్లో (Inter Results) ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల (Gandhari Government Junior College) ప్రిన్సిపాల్ గంగారాం తెలిపారు. బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 22వరకు తరగతులుంటాయన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకుగాను ఆయా సబ్జెక్టు అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.