అక్షరటుడే, బాన్సువాడ: Intermediate Education | మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను (Government Girls Junior College) తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ పద్మ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల రికార్డులు, పాఠశాల వసతులను (school facilities) సమీక్షించారు.
అనంతరం అధ్యాపకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలన్నారు. రాబోయే ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అసద్ ఫారుఖ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
