- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | డబ్బుల కోసం వేధిస్తున్నాడని కొడుకును హతమార్చిన తండ్రి

Kamareddy | డబ్బుల కోసం వేధిస్తున్నాడని కొడుకును హతమార్చిన తండ్రి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | డబ్బుల కోసం నిత్యం వేధిస్తుండడంతో ఉద్దేశ్యపూర్వకంగానే కొడుకును తలపై కొట్టి తండ్రి హత్య చేశాడని కామారెడ్డి సబ్ డివిజనల్ (Kamareddy Sub-Divisional) ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు. బుధవారం సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్(Lingapur) గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ రెండు నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు.

అయితే వచ్చినప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసైన నిఖిల్ ప్రతిరోజూ డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. వేధింపులు భరించలేక ఈనెల 19న నిఖిల్​ను తండ్రి బాలరాజు రాడ్డుతో నిఖిల్ తలపై కొట్టి హత్య చేశాడు. కొడుకును హత్య చేసిన బాలరాజును అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News