అక్షరటుడే, వెబ్‌డెస్క్: layoffs | గత రెండు మూడేళ్లుగా టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల(Layoffs) పరంపర కొనసాగుతోంది. ప్రముఖ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ లేఆఫ్‌లను ప్రకటించింది. ఇంటెల్ గ్రూప్(Inter group) 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.
layoffs | వర్క్ ఫోర్స్ తగ్గింపు
ఇంటెల్(Intel) దిగ్గజం ఖర్చు నిర్వహణ తగ్గింపులో భాగంగా తన వర్క్ ఫోర్స్(Work force)ను తగ్గించుకుంటోంది. ఇంటెల్(Intel) తన బిజినెస్‌లో తగ్గుతున్న ఆదాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చిప్ తయారీలో AMD, NVidia వంటి ప్రత్యర్థి కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కుంటోంది. గతేడాది సైతం 15వేల ఉద్యోగాల కోత పెట్టిన ఇంటెల్ తాజాగా మరోసారి లేఆఫ్స్(Layoffs) ప్రకటించింది. అయితే ఇది గతేడాది కంటే తక్కువని సమాచారం.
layoffs | చిప్ మార్కెట్లో కీలక మార్పులు
ఇంటెల్(intel) కంపెనీ కీలకమైన విస్తరణ ప్రాజెక్టులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ ఉత్పత్తి సంస్థ(Chip manufacturing company) ఇంటెల్ ఉండేది. తన కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా లేఆఫ్స్ ప్రకటించినట్లు సమాచారం. చిప్ మార్కెట్లో అనేక కీలక మార్పులు చేసుకుంటుండడం ఇంటెల్‌కు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ చిప్ తయారీలో Nvidiaను ఇంటెల్ AI బీట్ చేయలేకపోతోంది. ఈ కారణంగా చిప్ తయారీలో అనేక ఛాన్స్‌లను కోల్పోయి వెనుకబడుతోంది.