అక్షరటుడే, ఇందూరు: Deputy CM Batti | గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోలార్ పవర్ ప్లాంట్లు (Solar power plants) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman Kumar), విద్యుత్ శాఖ(Power Department) ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులతో కలిసి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం అమలు చేయనున్నట్లు వివరించారు.
ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూముల్లో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిజిల్లా కలెక్టరేట్ పై, పార్కింగ్, క్యాంటీన్ల వద్ద సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రణాళికల రూపొందించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు.
Deputy CM Batti | అన్నిజిల్లాలకు ఒకే రకమైన యూనిట్లు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ఒకే నమూనాలో నిర్మించినందున.. అనుకూలమైన డిజైన్లను హైదరాబాద్ (Hyderabad) నుంచి ఎంపిక చేసి పంపిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అలాగే జిల్లా కార్యాలయాల నుంచి మంచి డిజైన్లు ఉంటే పంపాలని సూచించారు. జిల్లా వివరాలకు సంబంధించి ఫార్మాట్ అందజేస్తామని, పూర్తి వివరాలు నమోదు చేసి పంపాలని ఆదేశించారు.
Deputy CM Batti | త్వరలోనే కార్యాచరణ..
ప్రభుత్వ భవనాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన భవనాల వివరాలను కలెక్టర్లకు పంపాలని సూచించారు. నీటిపారుదల శాఖ, రోడ్ల భవనాల శాఖ పరిధిలో పెద్దఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు కూడా పంపాలని ఆదేశించారు.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా అచ్చంపేట నియోజకవర్గంలో (Achampeta Constituency) ప్రారంభించినట్లు తెలిపారు. వివరాలను వారం రోజుల్లోపు పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, టీజీ రెడ్ కో డీఎం రమణ, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.