Homeటెక్నాలజీEdits, an Instagram app | వీడియో ఎడిట్ కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త యాప్‌

Edits, an Instagram app | వీడియో ఎడిట్ కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త యాప్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Edits, an Instagram app | ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్​ను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన వీడియో ఎడిటింగ్ యాప్ video editing app ఇప్పుడు బాగా పాపులర్ అయింది.

ఆండ్రాయిడ్ యూజర్లకు బాగా ఉపయుక్తంగా ఉండేలా మెటా meta సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఎడిట్స్‌ (Edits, an Instagram app) పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది యాప్ స్టోర్(App Store), గూగుల్ ప్లే స్టోర్ (Google play store) రెండింటిలో అందుబాటులో ఉంది. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీని ద్వారా వీడియో క్రియేషన్ చాలా సులువుగా ఉంటుంది. ఇన్‌స్టా యూజర్లు తమ క్రియేటివిటీకి అనుగుణంగా వేరే యాప్స్‌పై ఆధారపడకుండా సులభంగా వీడియోలను రూపొందించుకోవ‌చ్చు.

Edits, an Instagram app | చాలా సులువుగా..

వీడియో క్రియేటింగ్‌, ఎడిటింగ్ చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని. యానిమేష‌న్స్‌(Animations), సౌండ్ యాడింగ్ చేయ‌డం అంతా సులువు కాదు. ఇందుకోసం పలు యాప్‌లు, వర్క్‌ఫ్లో అవసరం అవుతాయి. ఇలాంటి ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎడిట్స్‌ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. ఎడిట్స్ యాప్‌ ఫోన్ నుంచి నేరుగా హై క్వాలిటీ వీడియోలను(High quality videos) క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇతర యాప్స్‌ అవసరం లేకుండా ఈ యాప్ ద్వారా మొత్తం వీడియో క్రియేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

వీడియో ఎడిటింగ్‌ కోసం అవసరమైనవన్నీ ఇక్క‌డే ఉంటాయి. సింగిల్‌ క్లిక్‌తో అనేక టూల్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ సాయంతో స్టిల్‌ ఇమేజ్‌లను కూడా ఏఐ యానిమేషన్‌ సాయంతో వీడియోగా మార్చుకోవచ్చు. గ్రీన్‌ స్క్రీన్‌, వీడియో ఓవర్‌లే ఆప్షన్‌ ద్వారా బ్యాగ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. ఎడిట్‌ చేసిన వీడియోలను మెటా యాప్స్‌ అయిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో వెంటనే షేర్‌ చేసుకోవచ్చు. క్వాలిటీ కెమెరా, పర్‌ఫెక్ట్‌ ఫ్రేమ్, టైమ్‌లైన్, కటౌట్‌, ఏఐ యానిమేషన్ల వంటి టూల్స్ ఉపయోగించి మెరుగైన వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.