5
అక్షరటుడే, ఇందూరు: Inspire Award Nominations | ఇన్స్పైర్ అవార్డులకు ( Inspire Awards) సంబంధించి నామినేషన్ల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ప్రాజెక్టులను (students projects) తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
సెప్టెంబర్ 21వ తేదీ నుంచి దసరా సెలవులు (Dussehra holidays) ఉన్నందున, 20వ తేదీలోపు నామినేషన్లను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అతితక్కువగా నామినేషన్లు నమోదయ్యాయని.. కావున పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ను సంప్రదించాలన్నారు.
1 comment
[…] Nomination దాఖలు సమయంలో అభ్యర్థితో కలిపి ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. (Candidate + 2). […]
Comments are closed.