Homeతాజావార్తలుInspector postings | నాలుగోటౌన్​ ఎస్​హెచ్​వోగా సతీశ్​.. రూరల్​కు శ్రీనివాస్​..

Inspector postings | నాలుగోటౌన్​ ఎస్​హెచ్​వోగా సతీశ్​.. రూరల్​కు శ్రీనివాస్​..

మల్టీజోన్​–1 పరిధిలో ముగ్గురు ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inspector postings | మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ముగ్గురిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో బదిలీ అయిన వారిలో ముగ్గురు ఇన్​స్పెక్టర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి సీపీ సాయిచైతన్య బుధవారం ఆర్డర్​ జారీ చేశారు. సీసీఆర్​బీలో ఉన్న ఇన్​స్పెక్టర్​ సతీశ్​ కుమార్​ను నిజామాబాద్​ నాలుగో టౌన్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. అలాగే వీఆర్​లో ఉన్న సీహెచ్​.శ్రీనివాస్​ను నిజామాబాద్​ రూరల్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా పంపించారు. వెయిటింగ్​లో ఉన్న​ అశోక్​కు ఎన్​ఐబీ ఇన్​స్పెక్టర్​గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాగా.. త్వరలోనే వీరు బాధ్యతలు స్వీకరింంచనున్నారు.

Inspector postings | ఎస్​హెచ్​వోలుగా అప్​గ్రేడ్​

నిజామాబాద్​ నాలుగో ఠాణా, రూరల్​ పోలీస్​ స్టేషన్లకు ఇది వరకు ఎస్సైలు ఎస్​హెచ్​వోలుగా వ్యవహరించేవారు. కాగా.. ఆయా ఠాణాల పరిధిలో కేసులు పెరగడం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర కారణాల రీత్యా ఇన్​స్పెక్టర్లను ఎస్​హెచ్​వోలుగా నియమించాలని సీపీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన పంపిన ప్రతిపాదనకు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి ఆమోదం తెలిపారు. తదనుగుణంగా ఇన్​స్పెక్టర్లను ఎస్​హెచ్​వోలుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఠాణాల అప్​గ్రేడేషన్​కు సంబంధించి తదుపరి ఉత్తర్వులు అతి త్వరలో రానున్నాయి.