అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inspector Transfers | మల్టీ జోన్ వన్ (Multi Zone One) పరిధిలో పలువురు సీఐలు (Inspector Transfers) బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
భూపాలపల్లి డీసీఆర్బీ పనిచేస్తున్న ఎస్.రమేశ్‌ను సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇక అక్కడ పనిచేస్తున్న కందె రవీందర్‌ను డీఎసీఆర్బీ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న జె.రవి కిరణ్‌ను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌కు పంపించారు. వరంగల్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న డి.గురుస్వామిని ఆదిలాబాద్ జిల్లా బోథ్ సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఏ.వెంకటేశ్వర్ రావును ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.