Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఆహార కల్తీ నివారణకు తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్​

Collector Nizamabad | ఆహార కల్తీ నివారణకు తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్​

కల్తీ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్​లో అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | కల్తీ ఆహార పదార్థాలను నివారించేందుకు విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. కలెక్టరేట్​లో ఆహార కల్తీ నిరోధక శాఖ పనితీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హోటళ్లు, రెస్టారెంట్లు (Restaurants), మాల్స్, టిఫిన్ సెంటర్స్, ఆహార పదార్థాల దుకాణాలు తదితర వాటిని క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీ చేయాలని సూచించారు. నిజామాబాద్​తో పాటు, బోధన్, ఆర్మూర్, భీమ్​గల్​ పట్టణాల్లో తనిఖీలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే రీతిలో కలుషిత ఆహార పదార్థాలను తయారుచేసే, విక్రయించే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Collector Nizamabad | పాఠశాలలు, వసతి గృహాల్లో..

రెసిడెన్షియల్ స్కూళ్లు (Residential schools), వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజన పదార్థాల్లో కూడా కల్తీని నిరోధించాలని కలెక్టర్​ సూచించారు. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించిన సమయంలో వాటిని సీజ్ చేసి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపాలని, వాటి నివేదికల ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలు, వ్యాపార సంస్థలు తగిన అనుమతులు కలిగి ఉన్నాయా అన్నది పరిశీలిస్తూ, నిర్ణీత గడువును అనుసరిస్తూ వాటిని రెన్యూవల్ చేసుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారిణి సునీత తదితరులు పాల్గొన్నారు.