అక్షరటుడే, వెబ్‌డెస్క్: 108 ambulance : నిజామాబాద్ జిల్లా పొతంగల్ గ్రామంలో సేవలందిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్‌ను మంగళవారం ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ (ఈఎంఈ స్వరాజ్) ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందుల నిల్వలు పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన ఔషధాలు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు.
అంబులెన్స్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పరికరాల పనితీరు, ఎమర్జెన్సీ సేవల నిర్వహణ తీరును సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో సేవలందించే విధానంపై సిబ్బందికి సూచనలు చేశారు.
108 ambulance | మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం..
ఈ తనిఖీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, అంబులెన్స్ పైలెట్ ఉన్నారు. సిబ్బంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పొతంగల్ ప్రాంత ప్రజలకు అంబులెన్స్ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 108 అంబులెన్స్ సేవలను ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.