అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) కలిసి పలు వంతెనల నిర్మాణానికి నిధులివ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు (South Central Railway officials) శుక్రవారం కామారెడ్డిలో పర్యటించారు. చీఫ్ ఇంజనీర్ కనస్ట్రక్షన్ అమిత్ అగర్వాల్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ నవశ్రీ, సీనియర్ డెన్ కనస్ట్రక్షన్ దుర్గాప్రసాద్, నార్త్ డెన్ కనస్ట్రక్షన్ శశాంత్ నాందేవ్, డెన్ నిజామాబాద్ శంభు దయాల్ మీనా, కనస్ట్రక్షన్ నిజామాబాద్ ధర్మారావుల బృందం శుక్రవారం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.
Mla KVR | ఆర్వోబీ కోసం..
ఆర్వోబీ కోసం అధికారులు ప్రాథమికంగా స్థల పరిశీలన చేపట్టారు. వారికి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దగ్గరుండి మరీ మ్యాప్ ద్వారా వంతెన అవసరాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో పెరిగిన రద్దీ దృష్టిలో పెట్టుకొని వాసవి స్కూల్ వద్ద, వికాస్ నగర్ కాలనీ వద్ద, పాత రాజంపేట వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ప్రియ థియేటర్ రోడ్డులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవశ్యకత గురించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వివరించినట్లు తెలిపారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని, సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారని చెప్పారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు.