అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నగరంలోని కలెక్టరేట్లో బుధవారం జరుగనున్న ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. వర్షం పడే సూచనలు ఉండడంతో వేడుకకు వచ్చే వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. సీటింగ్ తదితర ఏర్పట్లను పక్కాగా చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.