4
అక్షటుడే, బోధన్ : Bodhan | గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శనివారం సందర్శించారు.
మోస్రా, చందూర్, వర్ని సత్యనారాయణపురం, బోధన్ మండలం సంగెం గ్రామ పంచాయతీలలో కొనసాగిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్‌ను తనిఖీ చేశారు. స్థానిక అధికారులు ఉన్నారు.