అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | మండలంలోని పిప్రి, బాబానగర్, జాగిర్యాల్ గ్రామాలను రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ బృందం (Risk Based Internal Audit team) గురువారం సందర్శించింది. ఇందులో భాగంగా పిప్రి గ్రామంలో (Pipri village) నీటి నిలువ కందకాల పనులు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు పరిశీలించారు.
బాబానగర్‌లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, సీసీ రోడ్డు పనులు (CC road works) పరిశీలించి, ఉపాధిహామీ రికార్డులు తనిఖీ చేశారు. జాగిర్యాల్‌లో కమ్యూనిటీ ప్లాంటేషన్, అంతర్గత దారుల్లో నాటిన మొక్కల పెంపకం, పశువుల షెడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర తనిఖీ బృందం అధికారులు సాధన, స్మిత, జిల్లా ఏపీడీ ఓంపాల్, అంబుడ్స్‌మెన్ శ్రీనివాస్, ఎంపీఓ జావిద్ ఆలీ, ఏపీవో నర్సయ్య, పీఆర్ ఏఈలు విక్రమ్, మేఘన, ఈజీఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

