అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal కేంద్రంలోని ఎస్సీ వాడలో గత వారం కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లు శిథిలావస్థకు చేరాయి.
ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను సోమవారం (సెప్టెంబరు 8) బాన్సువాడ బీజేపీ నాయకులు BJP leader ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ పరిశీలించారు.
tarpaulin covers Distribution | టార్పాలిన్ కవర్ల అందజేత..
బాధితులకు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ టార్పాలిన్ కవర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో శిథిల గృహాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇళ్లు Indiramma houses మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. బాధితులకు అండగా బీజేపీ ఉంటుందని హామీ ఇచ్చారు.
వెంట బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణంరాజు, బేగరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, బేగరి సాయికుమార్, మండల కార్యదర్శి ధర్మవరం వెంకటేష్ తదితరులు ఉన్నారు.