Homeజిల్లాలుకామారెడ్డిJukkal MLA | కాలువ మరమ్మతు పనుల పరిశీలన

Jukkal MLA | కాలువ మరమ్మతు పనుల పరిశీలన

- Advertisement -

అక్షరటుడే, బిచ్కుంద : Jukkal MLA | జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామంలో పెద్ద చెరువు ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) ఆదివారం పరిశీలించారు. 20 ఏళ్ల నుంచి ఈ కాలువను పట్టించుకునేవారు లేక పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమస్య తన దృష్టికి రావడంతో వెంటనే కాలువ మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే చెరువు ఆయకట్టు కింద సుమారు 600 ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. ఆయన వెంట నాయకులు అయిల్వార్ రమేష్, అధికారులు, తదితరులున్నారు.

Must Read
Related News