అక్షరటుడే, బాన్సువాడ: Hostel Inspection | పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ప్రత్యేకాధికారిణి అరుణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు పరిశీలించారు. సోమవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు వసతిగృహం ప్రహరీపై చెట్టుపడిన విషయాన్ని వార్డెన్ గంగాసుధా ప్రత్యేక అధికారిణి, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రహరీ కూలిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. వసతి గృహంలో ఇతర సమస్యలపై ఆమె విచారణ చేశారు.
