అక్షరటుడే, బోధన్: Saloora Mandal | ఇసుక రవాణాపై సాలూర మండలం తగ్గెల్లి గ్రామస్థులు (Taggelli village) ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ మేరకు వినూత్నంగా నిరసన తెలిపారు.
Saloora Mandal | పశువులను రోడ్డుపై నిలిపి..
గ్రామంలో నిత్యం ఇసుక అక్రమ (illegal sand) రవాణా కారణంగా వాహనాలు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో తాము పొలాలకు పశువులను తీసుకెళ్లాలంటే ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. దీంతో వారు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ పశువులను రోడ్డుపైనే నిలిపి ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సరిహద్దులోని మంజీర నది నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక నింపుకొని వెళ్తున్నాయన్నారు. రహదారి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని.. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదని వివరించారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు పశువులను నిలిపి ఇసుక రవాణాలను అడ్డుకున్నారు.