అక్షర టుడే, ఆర్మూర్: Armoor | ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. మండలంలోని అంకాపూర్‌లో (Ankapur) ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులను గుర్తించి, జాబితాలో పేర్లు తొలగించారని ఆరోపించారు. నిర్మాణ దశలోనే గ్రామంలో సర్వే చేసి 299మంది పేర్లతో జాబితా తయారు చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పేర్లను లిస్టు నుంచి తొలగించి, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కేటాయించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో నలుగురికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి దేవా రాములు, మండల సంయుక్త కార్యదర్శి బి కిషన్, నిఖిల్, పోశెట్టి, భోజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
