ePaper
More
    HomeతెలంగాణHyderabad | కండల కోసం ఇంజెక్షన్లు.. ఇద్దరి అరెస్ట్​

    Hyderabad | కండల కోసం ఇంజెక్షన్లు.. ఇద్దరి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ప్రస్తుతం యువత అందంగా కనిపించాలని కుతూహల పడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు యువకులు తమ కండలు పెంచుకోవడానికి జిమ్​కు వెళ్తుంటారు. అయితే జిమ్​లో సాధన చేసి తెచ్చుకోవాల్సిన కండలను కొందరు పౌడర్లు, ఇంజెక్షన్లు తీసుకొని తెచ్చుకుంటున్నారు. తర్వాత వాటి సైడ్​ ఎఫెక్ట్​లతో అనారోగ్యాల బారిన పడుతున్నారు.

    హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఎన్నో జిమ్​లు ఉన్నాయి. అయితే చాలా మంది యువకులు సిక్స్​ ప్యాక్ (Youth Six Pack)​, కండల కోసం నిత్యం జిమ్​కు వెళ్తున్నారు. అయినా కానీ వారికి సిక్స్​ ప్యాక్​ రాకపోవడంతో కొందరు జిమ్​ సెంటర్ల నిర్వాహకులు పౌడర్లు, ఇంజెక్షన్లు(Injections) ఇస్తున్నారు. ఎలాగైనా అందంగా కనిపించాలనే ఆశతో పలువురు యువత వీటిని తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్​లో పోలీసులు అరెస్ట్​ చేశారు.

    Hyderabad | 423 ఇంజెక్షన్లు స్వాధీనం

    శరీర పెరుగుదల కోసం అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్​ఫోర్స్​(Task Force), చత్రినాక పోలీసులు (Chatrinaka Police) అరెస్ట్​ చేశారు. వారి నుంచి 423 ఇంజెక్షన్లు, రెండు బైకులు, రెండు ఫోన్లు, రూ.9,430 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఫలక్‌నుమాలో నివసిస్తున్న మోడల్ మహమ్మద్ జుబేర్ (30) చెంగిచెర్లలో వైద్య పంపిణీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వేలుదండి వినయ్ కుమార్ (43) గా గుర్తించారు.

    Hyderabad | యువతే లక్ష్యంగా..

    జుబేర్​, వినయ్​ కలిసి ఎలాంటి లైసెన్స్​, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిమ్‌(Gym)కు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమ్ముతున్నారు. మొదట జుబేర్​ కూడా ఈ డ్రగ్​కు బానిసయ్యాడు. అనంతరం వినయ్ కుమార్ ద్వారా దీనిని సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న కపిల్ గౌతమ్ నుంచి ఈ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్ల విలువ రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...