అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | నూతనవారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets).. మధ్యాహ్నం తర్వాత ప్రారంభ లాభాలు ఆవిరవడంతో నష్టాల బాట పట్టాయి. చివరికి వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 162 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. తొలి గంట స్థిరంగా పైకి ఎగబాకిన సూచీలు.. ఆ తర్వాత నేల చూపులు చూశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ.. సెన్సెక్స్(Sensex) 80,248 నుంచి 80,851 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,606 నుంచి 24,791 పాయింట్ల మధ్యలో సాగాయి. చివరికి సెన్సెక్స్ 61 పాయింట్ల నష్టంతో 80,364 వద్ద, నిఫ్టీ(Nifty) 20 పాయింట్ల నష్టంతో 24,634 వద్ద స్థిరపడ్డాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడంతో రూపాయి ఒత్తిడికి గురవుతోంది. యూఎస్, భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలలో పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఉదయం బలంగా ప్రారంభమైన ఐటీ స్టాక్స్ ఆ తర్వాత డీలా పడ్డాయి. ఈ కారణాలతోపాటు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ మీటింగ్(RBI MPC meeting) ఫలితం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు పడిపోయాయి.
Stock Markets | పీఎస్‌యూ స్టాక్స్‌లో జోరు..
బీఎస్‌ఈలో పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ల షేర్లు జోరు మీదున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.96 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ 1.82 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.18 శాతం, ఎనర్జీ 1.10 శాతం, రియాలిటీ 0.97 శాతం, ఇన్‌ఫ్రా 0.52 శాతం పెరిగాయి. ఇండస్ట్రియల్ ఇండెక్స్ 0.32 శాతం, ఆటో(Auto) 0.12 శాతం, టెలికాం 0.10 శాతం, ఐటీ 0.07 శాతం నష్టాలతో ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం నష్టపోయింది.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,911 కంపెనీలు లాభపడగా 2,281 స్టాక్స్ నష్టపోయాయి. 185 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 146 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 166 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్ 2.30 శాతం, ఎస్‌బీఐ 1.58 శాతం, ఎటర్నల్ 1.18 శాతం, ట్రెంట్ 1.08 శాతం, బీఈఎల్ 1.02 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
యాక్సిస్ బ్యాంక్ 1.91 శాతం, మారుతి 1.65 శాతం, ఎల్‌టీ 1.17 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.01 శాతం, ఎయిర్‌టెల్ 0.81 శాతం నష్టపోయాయి.