అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market) రోజంతా ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిలాడుతూ సాగి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. ప్రధాన సూచీలను ఐటీసీ వెనక్కి లాగింది. గురువారం ఉదయం సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(Nifty) 44 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 85,101 నుంచి 85,451 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 26,113 నుంచి 26,197 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 32 పాయింట్ల నష్టంతో 85,188 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 26,146 వద్ద స్థిరపడ్డాయి. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధించడంతో ఐటీసీ(ITC) షేర్లు పది శాతం వరకు పడిపోయాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,211 కంపెనీలు లాభపడగా 1,952 స్టాక్స్ నష్టపోయాయి. 172 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 144 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 87 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఎఫ్ఎంసీజీలో అమ్మకాల ఒత్తిడి..
ఎఫ్ఎంసీజీ(FMCG) సెక్టార్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2.96 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.29 శాతం, హెల్త్‌కేర్ 0.15 శాతం నష్టపోయాయి. టెలికాం 1.69 శాతం, యుటిలిటీ(Utility) 1.51 శాతం, పవర్ 1.14 శాతం, ఆటో 0.95 శాతం, ఇన్ఫ్రా 0.93 శాతం, రియాలిటీ 0.84 శాతం, మెటల్ 0.82 శాతం, సర్వీసెస్ 0.64 శాతం, ఐటీ 0.56 శాతం, ఇండస్ట్రియల్ 0.55 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.45 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.27 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం లాభంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభపడగా.. 9 కంపెనీలు నష్టపోయాయి. ఎన్టీపీసీ 2.08 శాతం, ఎటర్నల్ 2.05 శాతం, ఎంఅండ్ఎం 1.40 శాతం, ఎల్టీ 1.38 శాతం, పవర్‌గ్రిడ్ 1.23 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
ఐటీసీ 9.69 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.46 శాతం, ఆసియా పెయింట్ 0.63 శాతం, బీఈఎల్ 0.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.42 శాతం నష్టపోయాయి.