ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​GGH Nizamabad | ఆస్పత్రిలో వృద్ధురాలిపై అమానుష ప్రవర్తన

    GGH Nizamabad | ఆస్పత్రిలో వృద్ధురాలిపై అమానుష ప్రవర్తన

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: GGH Nizamabad | నగరంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం నిత్యకృత్యమయ్యిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రిలో అరకొర సౌకర్యాల కారణంగా రోగులు అవస్థలు పడుతుంటే.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తన కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    GGH Nizamabad | ఆస్పత్రి ఆవరణలోనే..

    జిల్లా ఆస్పత్రిలో వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సీపీఐ ఎంఎల్​ CPI ML (Prajapantha) జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ ఆరోపించారు. ఆయన​ తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ (Perkit)​ గ్రామానికి చెందిన బుజ్జమ్మను అనారోగ్యం కారణంగా ఈనెల 24న 108 సిబ్బంది జీజీహెచ్​కు తీసుకొచ్చారు. అయితే ఆమె కాలికి పట్టి కట్టిన వైద్యసిబ్బంది ఆస్పత్రి ఆరుబయట పడుకోబెట్టారని ప్రభాకర్​ ఆరోపించారు. సమాచారం అందుకున్న తాము ఆస్పత్రికి వెళ్లి చూడగా ఆస్పత్రి బయటే బుజ్జమ్మను ఉంచారని వివరించారు. ఆమెకు తోడుగా ఎవరూ లేరని.. ఆస్పత్రి సిబ్బంది ఇలా అమానుషంగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...