Homeజిల్లాలునిజామాబాద్​POCSO Act | ఎడపల్లిలో అమానవీయ ఘటన.. కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

POCSO Act | ఎడపల్లిలో అమానవీయ ఘటన.. కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

ఎడపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎస్సై రమ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: POCSO Act | ఎడపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎస్సై రమ (SI Mutyala Rama) తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలోని (Yedapally Mandal) ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై కొన్నిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఆయన భార్య కొన్ని నెలలుగా ముంబయిలో (Mumbai) ఉంది. అయితే ఇంట్లోని తన కూతురిపై సదరు ప్రబుద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల తల్లి స్వగ్రామానికి చేరుకోగా తండ్రి చేస్తున్న నిర్వాకాన్ని కూతురు చెప్పింది. దీంతో ఆమె తన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రెండురోజుల క్రితం ఆయన మళ్లీ కూతురిపై లైంగికదాడి యత్నించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.