ePaper
More
    Homeబిజినెస్​Infosys | ఉద్యోగులకు శుభ‌వార్త చెప్పిన ఇన్ఫోసిస్.. ఇలాంటి ప‌థ‌కం పెట్టడం తొలిసారి..

    Infosys | ఉద్యోగులకు శుభ‌వార్త చెప్పిన ఇన్ఫోసిస్.. ఇలాంటి ప‌థ‌కం పెట్టడం తొలిసారి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Infosys | భారతదేశం(India)లో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్(Infosys) తన ఉద్యోగులకు గుడ్​న్యూస్ చెప్పింది. కొత్తగా ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో, ఇంటర్వ్యూలు నిర్వహించే సీనియర్ ఉద్యోగులకు నగదు రూపంలో ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రోత్సాహక పథకం జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా తన ఉద్యోగులకు కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది ఇన్ఫోసిస్. సంస్థ తరఫున ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు సమాచారం.

    Infosys | ఈ విధానం ఎలా?

    ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు చేసే ప్రతి ఉద్యోగికి ₹700 విలువ చేసే 700 పాయింట్లు లభిస్తాయి. ఇది లాటరల్ రిక్రూట్‌మెంట్ (అంటే అనుభవం కలిగిన ఉద్యోగులను నియమించడం)లో భాగంగా అమలు అవుతుంది. టెక్నికల్ నిపుణులు, ట్రాక్ లీడ్‌లు(Track Leads), ఆర్కిటెక్ట్‌లు(Architects), ప్రాజెక్ట్ మేనేజర్లు(Project Managers) (JL5 & JL6) – వీరే ఇంటర్వ్యూకు అర్హులు. ఎంపికైన అభ్యర్థి హాజరైతే మాత్రమే ప్రోత్సాహకం లభిస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించడం గ‌మ‌నార్హం. హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్ టీమ్ ఉద్యోగులు, సబ్-కాంట్రాక్టర్లు, సీనియర్ లీడర్‌షిప్ హోదాలో ఉన్నవారు ఈ నగదు ప్రోత్సాహక పథకం నుండి మినహాయించబడ్డారు.

    మరోవైపు ఇంటర్వ్యూ రద్దయితే లేదా అభ్యర్థి హాజరు కాకపోతే, ఉద్యోగులు ప్రోత్సాహకాన్ని క్లెయిమ్ చేయలేరు. కానీ, ఈ విషయంపై ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. TCS, విప్రో, HCL Tech యాక్సెంచర్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు ఇటీవల కాలంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను తగ్గించి, అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇంటర్వ్యూల కోసం అవసరమైన టెక్నికల్ నిపుణుల కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తమ సీనియర్ వర్క్‌ఫోర్స్‌(Senior workforce)ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంట్లో ఉద్యోగులకు కూడా లాభం ఉండడంతో, విన్-విన్ సిట్యువేషన్ ఏర్పడుతుంది.

    Latest articles

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    More like this