అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTI Commissioner | రాష్ట్ర సమాచార కమిషనర్‌గా జి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రశేఖర్‌రెడ్డిని సమాచార కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ప్రస్తుతం సీఎంవోలో ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరేగావ్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి 1994-95లో నిజామాబాద్ జిల్లాలో అటవీ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
