HomeతెలంగాణInflation Rate | మరోసారి మైనస్​లో ద్రవ్యోల్బణం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు అంటున్న నిపుణులు

Inflation Rate | మరోసారి మైనస్​లో ద్రవ్యోల్బణం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు అంటున్న నిపుణులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం (Inflation) భారీగా తగ్గింది. వరుసగా రెండో సారి మైనస్​లో నమోదు అయింది. జూన్​లో తెలంగాణ (Telangana)లో ద్రవ్యోల్బణం -0.93 శాతంగా ఉండగా, జులైలో –0.44గా నమోదు అయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పడు కూడా ద్రవ్యోల్బణం మైనస్​లో నమోదు కాలేదు. తాజాగా వరుసగా రెండు సార్లు ఇన్​ఫ్లేషన్​ రేట్​ మైనస్​లో ఉండటంతో ఆర్థిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.

ద్రవ్యోల్బణం పెరిగితే రేట్లు పెరుగుతాయి. అదే తగ్గితే రేట్లు దిగి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మైనస్​ ద్రవ్యోల్బణం నమోదు కావడంతో రేట్లు భారీగా తగ్గినట్లు అర్థం. రేట్లు తగ్గితే మంచిదే కాదా అంటారా.. కానీ అక్కడే తిరకాసు ఉంది. ఇన్​ఫ్లేషన్​ మైనస్​లోకి వెళ్లిందంటే.. వస్తువులకు డిమాండ్​ తగ్గిందని అర్థం. దీంతో కంపెనీల లాభాలు తగ్గుతాయి. ప్రోడక్టివిటీ తగ్గి కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతుంది. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయం (Tax Income) కూడా తగ్గుతుంది.

Inflation Rate | అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

దేశంలో కోవిడ్​ వ్యాప్తి సమయంలో రాష్ట్రం 10 శాతానికి పైగా ద్రవ్యోల్బణంతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా మైనస్​ ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, నెగిటివ్​ ద్రవ్యోల్బణం రెండూ కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

Inflation Rate | జాతీయ సగటు 2.10

గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జులైలో తెలంగాణలో ద్రవ్యోల్బణ రేటు -0.44 శాతంగా ఉంది. ఇదే టైమ్​లో జాతీయ సగటు 2.10 శాతం ఉండటం గమనార్హం. జూన్​లో తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.93 శాతంగా ఉండగా, జాతీయ సగటు 1.55 శాతంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ఆర్థిక కార్యకలాపాలు తగ్గడానికి ఈ పరిస్థితి నిదర్శనం. ప్రజలు కనీస అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. ఆర్​బీఐ (RBI) ప్రకారం ఇన్​ఫ్లేషన్​ రేటు 2 నుంచి 4శాతం మధ్య ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా.. ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు.

Inflation Rate | సీఎంపై హరీశ్​రావు ఆగ్రహం

తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్​లోకి వెళ్లడంపై మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆర్థిక నిర్వహణలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వరుసగా రెండో నెల కూడా ద్రవ్యోల్బణంలోకి మైనస్​లో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్‌లో ఉందనడానికి ఇది ప్రమాదకరమైన సంకేతమని ఆయన హెచ్చరించారు. డిమాండ్ కుప్పకూలిపోతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Must Read
Related News