HomeతెలంగాణInflation | మరోసారి మైనస్​లో ద్రవ్యోల్బణం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

Inflation | మరోసారి మైనస్​లో ద్రవ్యోల్బణం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

Inflation | రాష్ట్రంలో మరోసారి ద్రవ్యోల్బణం మైనస్​లోకి వెళ్లింది. డిమాండ్​ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inflation | రాష్ట్రంలో మరోసారి ద్రవ్యోల్బణం మైనస్​లోకి వెళ్లింది. సెప్టెంబర్​ (September) నెలకు సంబంధించి –0.15 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం.

తెలంగాణ (Telangana) ఏర్పడినప్పటి నుంచి మూడో సారి మైనస్​ ద్రవ్యోల్బణం నమోదు అయింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జూన్​, జులై​, సెప్టెంబర్​ నెలల్లో ద్రవ్యోల్బణం సున్న కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఎక్కువగా ఉంటే రేట్లు పెరుగుతున్నట్లు లెక్క. ఇది మైనస్​లో ఉందంటే.. గత నెలతో పోలిస్తే రేట్లు తగ్గినట్లు అర్థం. అయితే రేట్లు తగ్గితే మంచిదే కాదా అంటారా.. అక్కడే తిరకాసు ఉంది.

Inflation | డిమాండ్​ లేకపోవడంతో..

ఏదైనా వస్తువుకు డిమాండ్​ ఉంటే రేట్లు పెరుగుతాయి. డిమాండ్​ (Demand) లేకపోతే రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం తెలంగాణలో డిమాండ్​ లేకపోవడంతోనే నెగిటివ్​లో ద్రవ్యోల్బణం నమోదు అవుతుంది. ఉద్యోగాలు లేకపోవడం, ప్రజల చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఫలితంగా మార్కెట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్​ లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (State Economy)పై కూడా ప్రభావం చూపుతుంది. రాష్ట్రానికి పన్నుల (Tax) రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది.

Inflation | దేశవ్యాప్తంగా 1.54 శాతం

దేశవ్యాప్తంగా సెప్టెంబర్​లో ఓవరల్​ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.07శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.04గా ఉంది. తెలంగాణకు వచ్చే సరికి రూరల్​ ఏరియాలో –0.29శాతం, అర్బన్​ ఏరియాల్లో –0.05గా ద్రవ్యోల్బనం ఉంది. మొత్తంగా –0.15శాతం ఇన్​ఫ్లేషన్​ రేటు ఉంది. కేరళలో అత్యధికంగా 9.05శాతం ఉంది. అస్సాంలో –0.56, బీహార్​ –0.51, ఉత్తర ప్రదేశ్​లో –0.61, ఆంధ్ర ప్రదేశ్​లో 1.36శాతం ద్రవ్యోల్బణం ఉంది.

Inflation | గతంలో సైతం..

తెలంగాణలో గతంలో సైతం ద్రవ్యోల్బణం మైనస్​లోకి వెళ్లింది. జూన్​లో మైనస్​ 0.93 శాతం, జులైలో –0.44గా నమోదు అయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పడు కూడా ద్రవ్యోల్బణం మైనస్​లో నమోదు కాలేదు. తాజాగా వరుసగా మూడు సార్లు ఇన్​ఫ్లేషన్​ రేట్​ మైనస్​లో ఉండటంతో ఆర్థిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ (Congress Govt) వైఫల్యంలోనే ఇది సాధ్యమైందని బీఆర్​ఎస్​ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.