అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Sridhar Babu | మెదక్ జిల్లాలోని (Medak district) కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన 36 పరిశ్రమల నిర్మాణం పూర్తయిందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఈ పరిశ్రమలతో సుమారు 5 వేల ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆయన సచివాలయంలో కొండపూర్ పారిశ్రామికవేత్తల సంఘం (Kondapur Industrialists Association) ప్రతినిధులతో బుధవారం సమావేశం అయ్యారు. పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరించాలని, జాతీయ రహదారికి అనుసంధాన రహదారి పనులను పూర్తి చేయాలని, మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Minister Sridhar Babu | 64 యూనిట్లలో..
పరిశ్రమల ప్రారంభంపై చర్చించడానికి టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్న 64 యూనిట్లలో, 36 యూనిట్ల నిర్మాణం పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. పారిశ్రామిక యూనిట్లను సకాలంలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెట్టుబడుల డైరెక్టర్ మధుసూదన్, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.