అక్షరటుడే, ఇందూరు : Induru Municipal Election Winners | నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లుగా గెలిచిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యేక క్యాంప్‌ల నుంచి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం జరిగే హాల్‌కు వెళ్లారు.
Induru Municipal Election Winners | కాంగ్రెస్ పార్టీ నుంచి..
కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల వెంట పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud), ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు వచ్చారు. బీజేపీ నుంచి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు గెలుపొందిన 28 మంది అభ్యర్థులు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం సభ్యులు సైతం కార్యాలయానికి చేరుకున్నారు. వీరి ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.
