ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | అమిత్​షా పర్యటన.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

    CP Sai Chaitanya | అమిత్​షా పర్యటన.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్ (Octopus), గ్రేహౌండ్స్, స్నీపర్​ టీంలతో (Sniper Team) భారీ బందోబస్తు ఏర్పాటు పటిష్టమైన నిఘావ్యవస్థ, బైనాక్యూలర్లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 1300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    CP Sai Chaitanya | ముమ్మరంగా తనిఖీలు..

    జిల్లా కేంద్రాన్ని పూర్తిగా పోలీసు శాఖ స్వాధీనంలోకి తీసుకుందని సీపీ వివరించారు. స్పెషల్ పార్టీ టీంలు, బీడీ టీంలు​, డాగ్ స్వ్కాడ్స్​లతో (Dog Squads) బస్టాండ్​, రైల్వేస్టేషన్​ తదితర ప్రాంతాలను జల్లెడ పట్టామని సీపీ పేర్కొన్నారు. వారం రోజులుగా నగరంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీలు చేశామని పేర్కొన్నారు. నగరంలో అమిత్​షా పర్యటించే ప్రాతంలోని అన్ని చోట్లా ఇళ్లను సైతం పరిశీలించామని వివరించారు.

    CP Sai Chaitanya | కొత్తవారిని ఇళ్లలోకి ఆహ్వానించొద్దు..

    అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు నిఘా ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజలు ఎవరూ కూడా కొత్తవారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించవద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే 100కు లేదా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

    CP Sai Chaitanya | ఇతర జిల్లాల నుంచి పోలీసులు..

    కేంద్రమంత్రి అమిత్​షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ (Adilabad), జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందితో పాటు బెటాలియన్​ సిబ్బంది (Battalion Police) బందోబస్తులో పాల్గొంటున్నారని వివరించారు. ఈ పర్యటన సందర్భంగా అడుగడుగునా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. డ్రోన్ కెమెరాలు, బైనాక్యూలర్లతో నిఘా విభాగం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పోలీసు సిబ్బందితో సహకరించాలని సూచించారు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...