ePaper
More
    HomeతెలంగాణNizamabad | ధాన్యం సేకరణలో అగ్రగామిగా ఇందూరు.. సీఎం ప్రశంసలు

    Nizamabad | ధాన్యం సేకరణలో అగ్రగామిగా ఇందూరు.. సీఎం ప్రశంసలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | యాసంగి సీజన్​కు సంబంధించి వరి ధాన్యం (Rice grain) సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) పాటు మంత్రులు అభినందించారు.

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka), మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8.19 లక్షల మెట్రిక్ వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా మిల్లర్లు, దళారులు రైతులను నష్టపర్చే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    Nizamabad | పీడీయాక్ట్​ అమలు చేయాలని ఆదేశాలు..

    ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించినందున తదనుగుణంగా ఖరీఫ్ సీజన్​కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో భూభారతి (bhubarathi) రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికల రూపొందించుకోవాలని చెప్పారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రులు ఈనెల 28, 29 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని పేర్కొన్నారు.

    Nizamabad | అధికారులకు కలెక్టర్​ సూచనలు..

    అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) జిల్లాలో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు.

    700 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో 625 కేంద్రాలను మూసివేశామన్నారు. సన్న రకం ధాన్యం 7.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. దొడ్డు రకం 93.24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి 10 లక్షల మంది రైతులకు వారి ఖాతాలో రూ.1,786 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయా గౌడ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

    More like this

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...