అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Guinness Book of world record | ఇందూరు కుర్రోడు సుశాంత్ గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness Book of World Records) స్థానం సంపాదించాడు. బైక్‌పై లడఖ్, ఉమ్‌లింగ్‌లాను (Ladakh and Umling La) అధిరోహించిన మొదటి మోటోవ్లాగర్‌గా చరిత్రకెక్కాడు.
Guinness Book of world record | 7,316 కి.మీ ఎపిక్ జర్నీ పూర్తిచేసి..
నగరానికి చెందిన యువ మోటోవ్లాగర్ సుశాంత్ తన సొంత 400 సీసీ బైక్‌పై నిజామాబాద్ నుంచి లడఖ్ (Nizamabad to Ladakh) వరకు రౌండ్ ట్రిప్ పూర్తి చేసిన మొదటి డాక్యుమెంటెడ్ మోటో వ్లాగర్‌గా నిలిచాడు. ఇందులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారబుల్ పాస్ ఉమ్లింగ్ లా (19,024 అడుగులు / 5,883 మీటర్లు)ను అధిరోహించాడు. ప్రయాణంలో భాగంగా 7,316 కి.మీ (రౌండ్ ట్రిప్)లను పూర్తి చేశాడు.
నిజామాబాద్ నుంచి..
నిజామాబాద్ నుంచి ప్రారంభమైన ప్రయాణం అగ్రా, మథురా, ఢిల్లీ, జమ్మూ, వైష్ణో దేవి, శ్రీనగర్, పహల్గాం, సోనమార్గ్ లే, ఖార్దుంగ్ లా, డిస్కిట్ మఠం, హుందర్, పాంగాంగ్ లేక్, హన్లే ప్రాంతం ఉమ్లింగ్ లా (ఇండియా-చైనా సరిహద్దు) (India-China border) మనాలి, చండీగఢ్ ద్వారా తిరిగి వచ్చాడు. తన 22 వీడియోల సిరీస్‌లోని ఎపిసోడ్ 17లో ‘నిజామాబాద్ నుంచి మొదటి వ్యక్తి ఉమ్లింగ్లా చేరుకున్నాడు’ అని గర్వంగా ప్రకటించాడు. అత్యంత ఎత్తు, తక్కువ ఆక్సిజన్, కఠిన రోడ్లు, అనిశ్చిత వాతావరణం వంటి సవాళ్లను ఎదుర్కొన్నానని ఆయన వివరించారు. ఈ సోలో స్టైల్ లాంగ్ హాల్ రైడ్‌ను తెలుగులో మోటోవ్లాగ్ల రూపంలో పూర్తిగా డాక్యుమెంట్ చేశాడు. నేటి యువతకు స్ఫూర్తిగా సుశాంత్ నిలుస్తున్నాడు.