అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | ) విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results)తమ సత్తా చాటారు. విద్యార్థిని హేమశ్రీ బట్టు 578 మార్కులు, సాయి హర్షిణి 571, వర్షిణి బట్టు 567 మార్కులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ రాజు తెలిపారు. పాఠశాల నుంచి పరీక్షలు రాసిన 39మందిలో అందరూ ఉత్తమ మార్కులతో పాసయ్యారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు.