అక్షరటుడే, ఇందూరు: Indramma Housing funds | ఇందిరమ్మ ఇళ్ల కోసం ఓ వైపు నిలువ నీడలేనివారు, అభాగ్యులు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తుంటే.. మరోవైపు అక్రమార్కులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
తాజాగా ఇందిరమ్మ ఇళ్ల Indramma Housing scheme నిధుల గోల్మాల్ బాగోతం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. ఇక్కడి సారంగాపూర్ పరిధిలోని నెహ్రూనగర్‌లో ఓ మహిళ ఖాతాలోకి అధికారులు రూ. లక్ష జమ చేశారు.
కాగా, ఈ నిధులను స్థానిక మాజీ సర్పంచి దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు.
Indramma Housing funds | ఇరువర్గాల గొడవ..
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సారంగపూర్‌కు అమీన్‌ఉల్లా, నిజామాబాద్ కాంగ్రెస్ Congress నేతలు మోయిన్ యూనుస్, షేక్ జాకిర్ అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొవడ జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అధికారులు సర్దిచెప్పారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జాకిర్, మోయిన్ ఫిర్యాదు చేశారు.
“అధికారులు లబ్ధిదారుల భూములను పరిశీలించి, హద్దులు నిర్ణయించకుండానే వారి ఖాతాల్లో డబ్బులు వేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉంది..” అని ఆరోపించారు.