HomeతెలంగాణTurmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​...

Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Union Minister) అన్నారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలో పసుపు బోర్డు (Turmeric Board) కార్యాలయం ప్రారంభించిన అనంతరం పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ (PM Modi) హామీ ఇచ్చారన్నారు. మోదీ మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. బోర్డు ఏర్పాటుతో ఇక ఎప్పటికీ పసుపు రేటు పడిపోదని అమిత్​ షా పేర్కొన్నారు.

Turmeric Board inauguration | ఎగుమతుల కోసం ప్రత్యేక చర్యలు

పసుపు బోర్డు ద్వారా మార్కెటింగ్​ సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు. పసుపు మార్కెటింగ్​, ఎగుమతుల కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్​ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్​ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్​కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. భారత్​ ఆర్గానిక్​ కో ఆపరేటివ్​ లిమిటెడ్ (Bharat Organic Cooperative Limited)​, భారత్​ కో ఆపరేటివ్​ ఎక్స్​పోర్ట్​ లిమిటెడ్ (Bharat Cooperative Export Limited)​ శాఖలు నిజామాబాద్​లో ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా పసుపు ఎగుమతులు పెంచుతామని అమిత్​ షా పేర్కొన్నారు.

Turmeric Board inauguration | పాకిస్తాన్​కు దీటైన జవాబు ఇచ్చాం

ఉరి, పుల్వామా, పహల్​గామ్​ దాడులకు దీటైన బదులు ఇచ్చామని అమిత్​ షా తెలిపారు. పదేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్​పై భారత్​ దాడి చేసిందని చెప్పారు. సర్జికల్​ స్ట్రైక్​, ఎయిర్​ స్ట్రైక్​ చేశామని గుర్తు చేశారు. ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) ద్వారా పాకిస్తాన్​ గడ్డపైకి వెళ్లి దాడి చేశామన్నారు. పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల హెడ్​ క్వార్టర్లను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. అంతేకాకుండా కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టిందని పేర్కొన్నారు. కానీ రాహుల్​ గాంధీ ఆధారాలు అడుగుతున్నారన్నారు. పాకిస్తాన్​ మాట రాహుల్​ గాంధీ నోట వస్తోందన్నారు.

Turmeric Board inauguration | 2026లో నక్సల్స్​ ముక్త్​ భారత్​

దేశంలో 2026 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్​ షా స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధిని నక్సలిజం అడ్డుకుంటోందన్నారు. మావోయిస్టులను అంతం చేయాలా వద్దా మీరే చెప్పండి అని అడిగారు. మావోయిస్టులు వెంటనే హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలని సూచించారు. దేశ భద్రతను మోదీ పటిష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.

Turmeric Board inauguration | కోట్లు కొల్లగొట్టిన బీఆర్​ఎస్​

బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని అమిత్​ షా అన్నారు. ధరణి, కాళేశ్వరం, సింగరేణి నియామకాలు, టీఎస్​పీఎస్సీ పేరిట కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ అవినీతి వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్​కు అధికారం అప్పగించారన్నారు. కానీ రేవంత్​రెడ్డి ప్రభుత్వం బీఆర్​ఎస్​ అవినీతిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రేవంత్​ సర్కారు కూడా అవినీతి మయంగా మారిందని విమర్శించారు. గతంలో తెలంగాణ బీఆర్​ఎస్​కు ఏటీఎంగా ఉండేదని, ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికారం మారినా అవినీతి మారలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని పేర్కొన్నారు.