అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SHO Raghupathi | జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముంబయిలో ప్రత్యక్షమయ్యాడు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని విక్రోలి వెస్ట్‌లో (Vikhroli West in Mumbai) ఓ ఫుట్‌పాత్‌పై జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడన్నారు. అక్కడి వాళ్లు విచారించగా..తాను నిజామాబాద్‌కు చెందిన వ్యక్తినని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని తెలిపారు. ఇంగ్లిష్‌లో దారాళంగా మాట్లాడుతున్నాడని.. ఫోటో చూసి సంబంధిత వ్యక్తులైవరైనా ఉంటే 1వ టౌన్లో సంప్రదించాలని సూచించారు.
