అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth Reddy | వేల్పూర్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంను (Indoor stadium) ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapalli Santosh Kumar) ఎంపీగా ఉన్న సమయంలో ఇండోర్ స్టేడియం మరమ్మతులకు రూ.35 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటితో షటిల్, కబడ్డీ కోర్టులను బాగు చేయించారు.
కాగా.. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శుక్రవారం స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు స్టేడియంను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేల్పూర్నకు (Velpur) గుర్తింపు తేవాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Mla Prashanth Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని బాల్కొండ, వేల్పూర్, ముప్కాల్, మోర్తాడ్, కమర్పల్లి, భీమ్‌గల్ మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.