ePaper
More
    HomeజాతీయంMetro trains | మెట్రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇండియన్ రైల్వే కూడా ఇలా చేస్తే బాగుండు..!

    Metro trains | మెట్రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇండియన్ రైల్వే కూడా ఇలా చేస్తే బాగుండు..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indore trains : మ‌నం ట్రైన్ జ‌ర్నీ చేస్తుంటే రైళ్ల‌లో గుట్కా అమ్మకాలు గుట్టుగా జరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. యథేచ్ఛగా అక్రమ రవాణా (Illegal transportation) సాగుతోంది. ఫిర్యాదులు వస్తే తప్ప దాడులు జరుగడం లేదు. దీంతో వ్యాపారులు ఇష్జారాజ్యంగా విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుతో గుట్కా నిల్వలపై, అలాగే అమ్మ కాలపై అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని బెంగళూరు(Bengaluru), హుబ్లీ(Hubli), బళ్లారి(Bellary), గదక్‌(Gadak) ప్రాంతాల నుంచి ఈప్రాంత వ్యాపారులు పెద్దఎత్తున గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడకు వచ్చాక పలు సురుకులతో పాటు గుట్కా, ఖైనీ తదితర నిషేధ వస్తువులను గ్రామాలకు తరలిస్తున్నారు.

    Indore trains : సంచ‌ల‌న నిర్ణ‌యం…

    కర్నాటక నుంచి వచ్చే రైళ్ల ద్వారా నిత్యం గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసింది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (Prashanthi Express), కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ (Kondaveedu Express), అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (Amaravati Express) రైళ్లలో గుట్కాలు చిన్న చిన్న మూటలుగా, లగేజ్‌ బ్యాగ్‌లలో పెట్టుకుని సాధారణ ప్రయాణికుల లాగా స్థానిక వ్యాపారులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తే అంతో ఇంతో ముట్టచెపుతూ తప్పించుకుంటున్నారు. అలాగే చెన్నై (Chennai city) ప్రాంతం నుంచి కూడా కొందరు వ్యాపారులు ప్రైవేటు వాహనాల్లో, బస్సులల్లో లగేజీ బ్యాగులలో పెట్టుకుని తెచ్చుకుంటున్నారు.

    మెట్రోలలో కూడా ఈ మ‌ధ్య గుట్కా అక్ర‌మ ర‌వాణా జరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ఇండోరో మెట్రో Indore Metro సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై మెట్రోలలో గుట్కా, టొబాకో బ్యాన్ చేసింది. ఈ నిర్ణ‌యం ఇండియ‌న్ రైల్వే(Indian Railways) కూడా తీసుకుంటే బాగుంటుంది క‌దా అని కొంద‌రు అంటున్నారు. మొత్తం మీద నిషేధిత గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుండగా ఎంత రేటైనా పెట్టి తమ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి గుట్కా ప్రియులు మాత్రం కొనుగోలు చేస్తుండడంతో గుట్కా వ్యాపారుల ఆదాయం బాగా పెరిగింది. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు మెట్రో రైల్ సంస్థ (Metro Rail) ఈ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...