HomeUncategorizedViral Video | రేసింగ్ పడవ ముందు భాగంపై 11 ఏళ్ల బాలుడి నృత్యం.. రేయాన్...

Viral Video | రేసింగ్ పడవ ముందు భాగంపై 11 ఏళ్ల బాలుడి నృత్యం.. రేయాన్ నృత్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒక బాలుడు తన స్టెప్పులతో ఊపేస్తున్నాడు. ఇండోనేషియా (Indonesia)కు చెందిన 11 ఏళ్ల రేయాన్ ఆర్కాన్ దిఖా అనే బాలుడు, ఓ రేసింగ్ పడవ ముందు భాగంలో చేసిన స్టైలిష్ నృత్యం(Stylish Dance) ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బోట్ మీద స్టెప్పులు వేసిన రేయాన్ డాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. అతడి వీడియో సోషల్ మీడియా (Social Media)లో ఫుల్ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు కోట్ల సంఖ్యలో వ్యూస్, లక్షల లైక్స్, వేల‌ల్లో కామెంట్లు వచ్చాయి. చిన్న వయసులో ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాకుండా, శరీరాన్ని అదుపు చేస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Viral Video | అద‌ర‌గొట్టేశాడు..

ఇండోనేషియాలో జరిగే రోయింగ్ పోటీల్లో, ప్రతి పడవలో ముందుభాగంలో “తుకాంగ్ టారీ” (Tukang Taree)అనే వ్యక్తి ఉంటారు. వీరు నర్తకుల్లా ప్రవర్తిస్తూ, ఆ బోటులో ఉన్న రోవర్లకు ఉత్సాహాన్ని నింపడం, సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈసారి ఆ బాధ్యతను చేపట్టిన రేయాన్, తన నృత్యంతో కేవలం బోటులోని వారినే కాదు, ఇంటర్నెట్ లో ఉన్నవారినీ ఉత్తేజపరిచాడు. ఈ బాలుడు అంత అద్భుతంగా ఎలా డ్యాన్స్ చేశాడు? ఇది ప్రొఫెషనల్ డాన్సర్ స్థాయిలో ఉంది, రేయాన్ మా ఫేవరేట్ అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ సొంతం చేసుకుంటోంది. డ్యాన్స్‌, అర్బన్ ఫోక్(Urban Folk) ప్రదర్శనలతో మిళితమైన ఈ వీడియో అసలైన విజువల్ ఫీస్ట్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో రేయాన్ ఆర్కాన్ దిఖా తన ప్రదర్శనతో డిజిటల్ ప్లాట్‌ఫాంలను షేక్ చేస్తున్నాడ‌నంలో ఎలాంటి సందేహం లేదు. ఇత‌గాడి ధైర్యానికి, టాలెంట్‌కి ఫిదా అవ్వ‌డ‌మే కాదు ప్ర‌శంస‌లు కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. మ‌రి మీరు కూడా ఓ సారి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.