Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme| ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం

Indiramma Housing Scheme| ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Indiramma Housing Scheme | పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు వరంలాంటివని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) అన్నారు. లింగంపేట(Lingampet) మండలం ముస్తాపూర్​ గ్రామంలో లబ్ధిదారు జూకంటి అనితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Indiramma Housing Scheme | ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

ధాన్యాన్ని త్వరగా రైస్​మిల్లులకు తరలించాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. లింగంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోతాయిపల్లిలో సర్వే నంబర్​.89లో భూభారతి (Bhubarathi) కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. భూభారతి డెస్క్​ను పరిశీలించారు. తనిఖీల్లో అదనపు కలెక్టర్ విక్టర్​, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్​ రాజేందర్​, అధికారి మల్లిఖార్జున బాబు, డీఆర్డీవో సురేందర్, తహశీల్దార్​ సురేష్ తదితరులు పాల్గొన్నారు.