అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు (Indiramma Housing Scheme) వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం డీకంపల్లిలో గురువారం పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో రాజలింగం, పంచాయతీ కార్యదర్శి దినేష్, ఏవో రాంబాబు, ఏఈవో వసుధన్, ఐకేపీ ఏపీఎం ఉమా కిరణ్, సీఈసీ రాజేష్, సంతోష్, అనిత, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గిరీష్, ఆలూర్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ అరుణ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నాగన్న, మాజీ ఉప సర్పంచ్ పోశెట్టి, భరత్, ప్రమోద్, బీజేపీ ఆలూర్ మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, వీడీసీ సభ్యులు ఉన్నారు.
1 comment
[…] ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి(Mla Rakesh Reddy) […]
Comments are closed.