అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. బుధవారం పట్టణంలోని శక్కర్నగర్లో (Shakkarnagar) నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి (Indiramma Housing Scheme) భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 120 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ పద్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
